KKD: కాకినాడ నగరంలోని వార్ఫ్ రోడ్లో ఉన్న మినీ గూడ్స్ ఆటో వెహికల్ యూనియన్ ప్రతినిధులకు గురువారం ట్రాఫిక్ పోలీసులు నిబంధనలపై అవగాహన కల్పించారు. పరిమితికి మించి లోడ్ వేయరాదని, రాంగ్ రూట్లో పార్కింగ్ చేయకూడదని ట్రాఫిక్-1 సీఐ నూని రమేశ్ సూచించారు. మితిమీరిన వేగంతో వెళ్లవద్దని సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కేసులు తప్పవని హెచ్చరించారు.