భారత సైన్యానికి సంఘీభావంగా HYDలో చేపట్టిన ర్యాలీలో ఉగ్రమూకలకు సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరికలు జారీ చేశారు. ఏ దేశమైన సరే ఉగ్రవాదాన్ని ప్రోత్సహించి భారత సార్వభౌమత్వంపై దాడి చేయాలనుకొని.. భారత్ వైపు కన్నెత్తి చూస్తే ఈ భూమ్మీద నూకలు చెల్లినట్లేనని మండిపడ్డారు. ఎన్నికలు వచ్చినప్పడు రాజకీయాలు ఉండొచ్చు. కానీ ఉగ్రవాదులను అణచివేసేందుకు కేంద్రానికి కాంగ్రెస్ పూర్తి మద్దతు ఇస్తోందన్నారు.