KKD: రాజమండ్రిలో శుక్రవారం నిర్వహించిన అమరావతి కళా వీధి ప్రదర్శనలో సీఎం నారా చంద్రబాబు స్వయంగా చిత్రీకరించిన బుద్ధుడి చిత్రం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ చిత్ర పటానికి ఉప సభాపతి కె. రఘు రామకృష్ణంరాజు రూ. 1,01,116లు చెల్లించి శుక్రవారం కొనుగోలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు చిత్రీకరించిన బుద్ధుడిని తాను సొంతం చేసుకోవడం ఆనందంగా ఉందని అన్నారు.