TPT: చంద్రగిరి నియోజకవర్గ పరిధిలోని చిన్నగొట్టిగల్లు, ఎర్రవారిపాలెం, చంద్రగిరి మండలాలకు చెందిన 64 మంది రైతులు ఏనుగుల దాడుల్లో పంటలు నష్టపోయారు. వారికి పరిహారంగా 10.24 లక్షల రూపాయల నష్ట పరిహారాన్ని గురువారం ఎమ్మెల్యే పులివర్తి నాని అందించారు. ఈ సందర్భంగా రైతులు ఆయనకు ధన్యవాదాలు తెలిపారు.