AP: YS వివేకా హత్య కేసుపై PCC అధ్యక్షురాలు షర్మిల కీలక వ్యాఖ్యలు చేశారు. గత ఎన్నికల తర్వాత సునీతారెడ్డి తనను కలిశారని గుర్తు చేశారు. ఒక వైపు తన అన్న ఉన్నా.. సునీతకు మద్దతు ఇస్తూనే వచ్చానని తెలిపారు. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్‌ను అవినాష్ రెడ్డి తన ఇంటికి పిలిపించుకున్నారని అన్నారు. ఆ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్‌తో బలవంతంగా సంతకం చేయించారనే విషయం తనకు తెలిసిందని ఆరోపించారు.