ELR: దుగ్గిరాల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం దెందులూరు నియోజకవర్గం పరిధిలోని అధికారులతో ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ సమావేశమయ్యారు. ఆయన మాట్లాడుతూ.. పేద ఎస్సీ ఎస్టీలకు రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా 200 యూనిట్ల విద్యుత్ అందించే దిశగా ముందుకు వెళుతుందన్నారు. నియోజకవర్గంలోని 14 వేల ఎస్సీ ఎస్టీ కుటుంబాలకు సోలార్ విద్యుత్ అందించే విధంగా ప్రయత్నిస్తున్నామన్నారు.