హీరో నాగచైతన్య-శోభిత దంపతులు ప్రధాని మోదీని కలిశారు. పార్లమెంట్‌లో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ANRపై యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ రాసిన ‘అక్కినేని కా విరాట్ వ్యక్తిత్వ’ పుస్తకావిష్కరణ నిమిత్తం ఈ జంట ప్రధానితో భేటీ అయింది. ఈ మేరకు నాగచైతన్య ట్వీట్ చేశారు. మోదీతో కలిసి తీసుకున్న ఫొటోని పోస్ట్ చేయటంతో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ATP: గుత్తి మండలం తొండపాడు గ్రామంలో వెలిసిన శ్రీ బొల్లికొండ రంగనాథ స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా మూడవరోజు శనివారం ఆలయంలో స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. వేకువజామున స్వామివారికి పవిత్ర గంగాజలాలతో అభిషేకాలు నిర్వహించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తమ మొక్కుబడులను చెల్లించుకున్నారు.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ మొదలైంది. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. బీజేపీ, ఆప్ మధ్య హోరాహోరీ పోరు నెలకొంది. బీజేపీ 12, ఆప్ 10 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. న్యూఢిల్లీ స్థానంలో కేజ్రీవాల్, కల్కాజీలో ఢిల్లీ సీఎం ఆతిశీ, జంగపురాలో మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా వెనుకంజలో ఉన్నారు.
ఎమ్మెల్సీ, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ సత్తాచాటాలని, కార్యకర్తలు సైనికుల్లా పని చేయాలని కామారెడ్డి ఎమ్మెల్యే కేవీ. రమణారెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లాబీజేపీ ఆఫీసులో జిల్లాబీజేపీ అధ్యక్షుడిగా నీలం చిన్నరాజులు ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా అధ్యక్షురాలు అరుణతార, బీజేపీ నేతలు మురళీధర్ గౌడ్, నెరేళ్ల ఆంజనేయులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ASR: ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా పాఠశాలలను నిర్వహించాలని సామాజక తనిఖీ ఎస్ఆర్పీ వెంకటరమణ సూచించారు. జీ.మాడుగుల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శుక్రవారం సామాజక తనిఖీ నిర్వహించారు. పాఠశాల నిర్వహణ వివరాలను సేకరించారు. తల్లిదండ్రులు, విద్యార్థులు, ఉపాధ్యాయులతో సమావేశం నిర్వహించారు. మధ్యాహ్న భోజనాన్ని మెనూ ప్రకారం అందించాలని, నాణ్యమైన విద్యను అందించాలని సూచించారు.
SKLM: కాజీపేట లో జరిగిన కొట్లాట కేసు విషయంలో పొందూరు పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న ఇద్దరు కానిస్టేబుల్‌లను ఎస్పీ మహేశ్వర రెడ్డి సస్పెండ్ చేశారు. మూడు రోజుల కిందట గ్రామంలో రెండు వర్గాలు ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. కొట్లాట జరగటానికి కానిస్టేబుళ్ల నిర్లక్ష్యమే కారణమని నిర్ధారిస్తూ ఎస్పీ వారిని సస్పెండ్ చేసినట్లు ఉన్నత అధికారులు తెలిపారు.
SKLM: శాలిహుండం లక్ష్మీనరసింహ స్వామి యాత్ర సందర్భంగా వంశ ధార నదిలో శనివారం ఉదయం నుంచి చక్రతీర్ధ స్నానం, కొండపైన దర్శనాలు ఉండటంతో ఎక్కడా అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా శ్రీకాకుళం డీఎస్పీ వివేకానంద, సీఐ పైడపునాయుడు ఆధ్వర్యంలో 250 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేసినట్లు డీఎస్పీ తెలిపారు.
BDK: కిన్నెరసాని నుంచి పాల్వంచ కేటీపీఎస్‌కు నీటిని సరఫరా చేసే కాల్వలో శుక్రవారం ఓ మొసలి ప్రత్యక్షమయ్యింది. అది రిజర్వాయర్ నుంచి కాల్వలోకి ప్రవేశించడాన్ని కొందరు పర్యాటకులు గుర్తించి వెంటనే అటవీ శాఖ సిబ్బందికి సమాచారం అందించారు. రేంజర్ కవితా మాధురి సిబ్బంది కిషన్, రాములు తదితరులతో వెంటనే వచ్చి వలలతో మొసలిని బంధించారు. అనంతరం జలాశయంలోకి వదిలారు.
ATP: జిల్లా పోలీస్ వార్షిక స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ విజయవంతంగా ముగిసింది. అనంతపురం రేంజ్ డీఐజీ షిమోసి, జిల్లా ఎస్పీ జగదీష్ విజేతలకు ట్రోఫీలు, మెడల్స్, మెమెంటోలు అందజేసి అభినందించారు. టగ్ ఆఫ్ వార్ విన్నర్స్‌గా జిల్లా ఎస్పీ జట్టు, రన్నర్స్‌గా అదనపు ఎస్పీ జట్టు నిలిచింది.
ATP: JNTU పరిధిలో గత సంవత్సరం నవంబర్, డిసెంబర్‌లో నిర్వహించిన బీటెక్ 3-1సెమిస్టర్ రెగ్యులర్, సప్లిమెంటరీ(R15, R19, R20) పరీక్షా ఫలితాలను విడుదల చేసినట్లు డైరెక్టర్ ఆఫ్ ఎవాల్యూయేషన్ నాగప్రసాద్ నాయుడు, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ శివ కుమార్ తెలిపారు. విద్యార్థులు ఫలితాల కోసం వెబ్‌సైట్https://jntuaresults.ac.inను సందర్శించాలని సూచించారు.
KMM: ముదిగొండ మండలంలోని ప్రతి గ్రామంలో రేషన్ కార్డు లేని ప్రతి ఒక్కరు దరఖాస్తు చేసుకోవాలని మండల తహశీల్దార్ సునీతా ఎలిజబెత్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. స్థానిక మీసేవా కేంద్రాల్లో రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. కొత్తగా పెళ్లి అయిన వారు నేరుగా మండల తహశీల్దార్ కార్యాలయంలో పాత కార్డుల్లో పేరు డిలీట్‌కి అప్లై చేసుకోవాలని పేర్కొన్నారు.
NZB: బోధన్ పట్టణంలో పట్టభద్రులు గళం బలం అనే సమావేశానికి శనివారం కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ నియోజకవర్గ పట్టభద్రుల అభ్యర్థి నరేందర్ రెడ్డి రానున్నారు. ఆయనతో పాటు బోధన్ ఎమ్మెల్యే ప్రొద్దుటూరి సుదర్శన్ రెడ్డి హాజరుకానున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఈ సమావేశంలో చర్చించచున్నారు.
TG: రాష్ట్రంలో పంచాయితీ ఎన్నికలకు ఎన్నికల సంఘం శరవేగంగా ఏర్పాట్లు చేస్తోంది. MPTC, ZPTC ఎన్నికలకు ఫ్రీ సింబల్స్‌ను ప్రకటిస్తూ.. జిల్లా ఎన్నికల అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. రిటర్నింగ్ అధికారులు, పోలింగ్ సిబ్బందిని ఈనెల 10వ తేదీ వరకు ఖరారు చేయాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించింది. 15వ తేదీ వరకు పోలింగ్ కేంద్రాల తుది జాబితాను విడుదల చేయాలని పేర్కొంది.
రౌడీ హీరో విజయ్ దేవరకొండ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమా ‘VD12’. ఈ మూవీ అప్‌డేట్ కోసం విజయ్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. తాజాగా రౌడీ హీరో అభిమానులకు చిత్ర బృందం గుడ్‌న్యూస్ చెప్పింది. ఈనెల 12న మూవీ టైటిల్ రివీల్ చేయడంతోపాటు టీజర్ కూడా విడుదల చేయనున్నట్లు సోషల్ మీడియా వైదికగా ప్రకటించింది. ఈ మేరకు ఓ పోస్టర్‌ను షేర్ చేసింది.
TG: అందుబాటులో ఉన్న బీసీ నేతలతో మాజీ మంత్రి కేటీఆర్ భేటీ అయ్యారు. ఎమ్మెల్సీ శంబిపూర్ రాజు నివాసంలో సమావేశం నిర్వహించారు. బీసీలకు కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలుపై చర్చించినట్లు తెలుస్తోంది. బీసీలకు కాంగ్రెస్ ద్రోహం చేసిందని ఆరోపణలు చేశారు. త్వరలోనే బీఆర్ఎస్ కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉంది.