GNTR: గుంటూరు, కృష్ణా జిల్లాల పట్టుభద్రుల ఎమ్మెల్సీగా ఆలపాటి రాజేంద్రప్రసాద్ బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. అమరావతిలో శాసనమండలి ఛైర్మన్ ఆలపాటి చేత ప్రమాణం చేయించారు. ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు తదితర నేతలు రాజేంద్రప్రసాద్ని అభినందించారు. పట్టభద్రుల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తానని ఆలపాటి వెల్లడించారు.