NTR: ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా ఇబ్రహీంపట్నంలో మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్.సవితని మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదుని కార్మిక సోదరులు ఘనంగా సత్కరించారు. ఆమె మాట్లాడుతూ.. కార్మికులు తమ హక్కుల కోసం రక్తం చిందించి పోరాడి సాధించిన రోజే మే డే అని అన్నారు.