NGKL: తాడూరు మండలం తుమ్మలసూరులో గురువారం విషాదం చోటు చేసుకుంది. పిండిగిర్ని దుకాణంలో విద్యుత్ షాక్తో తల్లి జయమ్మ(40), కొడుకు శ్రీకాంత్(15) మృతి చెందారు. పిండిగిర్ని నడుపుతుండగా శ్రీకాంత్ విద్యుత్ షాక్కు గురైన నేపథ్యంలో కొడుకును రక్షించుకునే ప్రయత్నంలో తల్లి జయమ్మ కూడా షాక్కు గురికావడంతో కొడుకుతోపాటు తల్లి మృతి చెందారు.