KMR: రాజంపేట మండలం పొందుర్తిలో గౌడ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం రేణుకా ఎల్లమ్మ ఆలయంలో కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణా రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. సంఘ సభ్యులు ఎమ్మెల్యేకు స్వాగతం పలికారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం భక్తులతో కలిసి ఎమ్మెల్యే తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పొందుర్తి గ్రామ అభివృద్ధికి కృషి చేస్తానని హామి ఇచ్చారు.