VSP: విశాఖ దక్షిణ నియోజకవర్గంలోని 14వ వార్డు ఆటో స్టాండ్ డ్రైవర్లకు ఆదివారం సాయంత్రం ఖాకీ చొక్కాలు పంపిణీ చేశారు. సీతమ్మపేటలోని జనసేన నగర పార్టీ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ చేతుల మీదుగా వీటిని అందజేశారు. వంశీకృష్ణ మాట్లాడుతూ.. నియోజకవర్గంలో జనసేన పార్టీ గెలుపునకు ఆటో డ్రైవర్లు అందించిన సహాయ సహకారాలను ప్రశంసించారు.