TPT: భార్య కోసం భర్త పోలీసులను ఆశ్రయించిన ఘటన ఇది. చంద్రగిరికి చెందిన యువతి, రాయలపురానికి చెందిన దయాసాగర్ ఈనెల 11న కైలాసకోనలో ప్రేమ వివాహం చేసుకున్నారు. ప్రాణరక్షణ కోసం పోలీసులను ఆశ్రయించారు. అయితే, తల్లికి ఆరోగ్యం బాగాలేదని 2 గంటల్లో పంపిస్తామని యువతిని ఆమె తండ్రి తీసుకెళ్లాడు. 4 రోజులు గడుస్తున్నా భార్య తిరిగి రాకపోవడంతో అతను మళ్లీ పోలీసులను ఆశ్రయించాడు.