సత్యసాయి: కార్మికుల సంక్షేమమే సీఎం చంద్రబాబు లక్ష్యమని మంత్రి సవిత తెలిపారు. గురువారం ఇబ్రహీంపట్నంలో నిర్వహించిన మే డే ఉత్సవాల్లో రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ మంత్రి సవిత పాల్గొన్నారు. మంత్రి మాట్లాడుతూ.. కార్మికులకు మే డే శుభాకాంక్షలు తెలియజేసి ర్యాలీలో పాల్గొన్నారు. సంపద సృష్టికి మూలమైన కార్మికుల క్షేమం, సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని పేర్కొన్నారు.