ప్రకాశం: ఒంగోలు నగరంలోని ఉత్తర బైపాస్ రోడ్డులో బృందావనం కళ్యాణ మండపంలో శుక్రవారం జిల్లా స్థాయి మినీ మహానాడు నిర్వహిస్తున్నట్లు జిల్లా టీడీపీ అధ్యక్షులు నూకసాని బాలాజీ తెలియజేశారు. ఈ మహానాడుకు జిల్లాలోని టీడీపీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇంఛార్జ్‌లతో పాటు, కార్పొరేషన్ చైర్మన్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.