NLR: జిల్లాలో ఐదేళ్లలోపు చిన్నారులందరికీ ఎంఆర్ (మీజిల్స్, రూబెల్లా టీకా) వ్యాక్సిన్ తప్పనిసరిగా వేయాలని జిల్లా కలెక్టర్ ఆనంద్ వైద్యాధికారులను ఆదేశించారు. నెల్లూరు కలెక్టర్ ఛాంబర్లో ఎంఆర్ వ్యాక్సినేషన్‌పై జిల్లా టాస్క్ఫోర్సు కమిటీ సమావేశం నిర్వహించారు. జిల్లాలో తట్టు, పొంగు, రూబెల్లా వ్యాధుల నివారణకు, చిన్నారులకు టీకాల వివరాలను కలెక్టర్ వివరించారు.