ATP: పామిడి మండల కేంద్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని శుక్రవారం జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలోనే వార్డులో పర్యటించి రోగులకు సమస్యల గురించి ఆరా తీశారు. ఆసుపత్రిలో అందుతున్న సౌకర్యాల గురించి రోగులకు ఆరా తీశారు. ఆసుపత్రి పరిసరాల ప్రాంతాలను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలని సిబ్బందికి సూచించారు.