AP: ప్రకాశం రోడ్డు ప్రమాదంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతిచెందడం బాధాకరమని పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు చంద్రబాబు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాధిత కుటుంబాలను ఆదుకోవాలని అధికారులను ఆదేశించారు. కాగా, ఇవాళ కొమరోలు మండలం తాటిచెర్లమోటు దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతిచెందిన విషయం తెలిసిందే.