CTR: కుప్పం పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో శుక్రవారం మినీ మహానాడు కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ కంచర్ల శ్రీకాంత్, ఆర్టీసీ వైస్ ఛైర్మన్ మునిరత్నం పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ.. ఈ నెల 27, 28, 29 తేదీలలో కడపలో జరిగే మహానాడును జయప్రదం చేయాలని కోరారు. మొత్తం 9 తీర్మానాలు ఆమోదించినట్లు ఎమ్మెల్సీ కంచర్ల పేర్కొన్నారు.