జీవితమంతా కొత్తవారిని ప్రోత్సహిస్తూ, వారి ద్వారా సూపర్‌డూపర్ హిట్లు నిర్మిస్తూ అతి తక్కువ కాలంలోనే అగ్రస్థానానికి చేరుకున్న ఘనత గడిచిన మూడు దశాబ్దాలలో దిల్‌రాజుకి తప్పితే మరొక్కరికి దక్కనే దక్కదు.
I AM A MONARCH OF ALL I SURVEY అనేది చాలా పాప్యులర్ ఇంగ్లీసు సేయింగ్. అంటే నేను సేవలందించిన ప్రతీ చోటా నేనే మొనగాడిని అని అర్ధం. ఈ మాట ఎందరికో తెలిసినా, మరెందరో తమ కోసమే ఈ మాట పుట్టిందని ఆత్మవంచన చేసుకుంటున్నా, నిజానికి ఇది ఏ ఒక్కరికో గానీ వర్తించని మాట. ఎందుకంటే చిన్నాచితకా మనుషులు, కేరాఫ్ అడ్రస్‌లు లేని వాళ్ళు కూడా ఇటువంటి ఫీలింగ్‌లో బతికేస్తుంటారు. ఎవరికిది నిజంగా అక్షరాల సూటవుతుంది? తమ క్రియాశీలకమైన నైజంతో, తెగింపుతో తమ ప్రయాణంతో పాటు ఎందరినో భుజాలకెత్తుకుని, వారివారి గమ్యాలను చేరుకునేందుకు వారధిగా, సారధిగా నిలిచి, వారందరూ కూడా ఆ వ్యక్తి ఫొటోను గుండెల్లో గూడుకట్టుకుని దాచుకుంటే అటువంటి వ్యక్తి అనుకోదగ్గ మాట అది. పరాకున ఆ వ్యక్తి ఆ మాటను జ్ఞప్తిలో ఉంచుకోకపోయినా, పబ్లిక్ అయినా ఆ మాటని ఆ సదరు వ్యక్తికి ఆపాదించి తీరుతుంది.
అటువంటి వ్యక్తే అగ్రనిర్మాత, అగ్ర పంపిణీదారు, ఫైనాన్షియర్, ఎగ్జిబిటార్ దిల్‌రాజు. జీవితమంతా కొత్తవారిని ప్రోత్సహిస్తూ, వారి ద్వారా సూపర్‌డూపర్ హిట్లు నిర్మిస్తూ అతి తక్కువ కాలంలోనే అగ్రస్థానానికి చేరుకున్న ఘనత గడిచిన మూడు దశాబ్దాలలో దిల్‌రాజుకి తప్పితే మరొక్కరికి దక్కనే దక్కదు. ఎవరెందరైనా రావచ్చు, కాంబినేషన్ల మీద వందల కోట్లు కొల్లగొట్టొచ్చు, దిల్‌రాజుకి ఎదురొచ్చి పంపిణీ వ్యవస్థని, ధియేటర్ల యాజమాన్యాన్ని చేజిక్కించుకోవడానికి ప్రయాస పడితే పడొచ్చు. కానీ దిల్ రాజు పెరఫార్మ్ చేసిన ఫీట్స్ ని మాత్రం కాపీ చేయలేకపోయారు. ఎప్పటికీ చేయలేరు కూడా. ఎందుకంటే దిల్‌రాజుది ఒరిజినాలిటీ. ఆర్గానిక్ కెపాసిటీ. జన్మత: సంక్రమించిన డిఎన్ఎ.
ఇప్పుడేదో దిల్‌రాజు డ్రీమ్స్ అనే ఓ ప్లాట్ఫార్మ్ దిల్‌రాజుగారు క్రియేట్ చేశారని కొత్తగా సంబరపడిపోనక్కర్లేదు. దిల్‌రాజు మొదటనుంచి చేసిందీ పనే. ఎంత మంది కొత్త దర్శకులను పరిచయం చేశారు. ఎన్ని సరికొత్త సంవిధానాలను తెరమీదకి తెచ్చారు. ఆయనే స్వయంగా కథలు ఆసాంతం విని, అందుకు వలసినంత సమయాన్ని క్రియేట్ చేసుకుని మైలురాళ్ళను సినిమా నందనోద్యానంలో నాటిన స్పెషల్ టచ్…..గోల్డెన్ టచ్ దిల్‌రాజుది. కీకారణ్యంలో క్రూరమృగాలను వేటాడే మేటి విలుకాడు పంచవన్నెల రామచిలుకను తన గుహలో పెంచుకుంటే అదో విచిత్రం. అబ్బురం కొలిపే విషయం అది. దిల్‌రాజు భారీ బడ్జెట్లతో, పులులు, సింహాలతో సినిమాలు చేస్తూనే మరో పక్క చిలుక సైజు శతమానం భవతిలాటి సినిమాలు కూడా బరిలో గెలుచుకొచ్చిన బలాదూర్ బలశాలి దిల్‌రాజు. అలా జరుగుతున్నప్పుడు, పిల్లలు పెద్దవాళ్లయ్యాక వాళ్ళని కూడా పులులు, సింహాల బరిలోకి దింపకుండా, దిల్‌రాజు ప్రొడక్షన్స్ అనే మరో బ్యానర్ మీద బలగం లాంటి సినిమాల బాధ్యతను వాళ్ళకి అప్పగించారు. తాను వెన్నుకాసి బలగం లాంటి చిన్నపాటి చిత్రాలకు తనదైన మేలిమి నగిషీలను అద్ది, దిద్ది పరిశ్రమకే మేలు చేసిన గొప్ప రేంజ్ ఆయన సొంతం అని ఆయనకి ఆయనే నిరూపించుకున్నారు.
అయితే ఇప్పుడు దిల్‌రాజు డ్రీమ్స్ ద్వారా ఆయన నూతన ప్రతిభకు, పరిశ్రమలోని రెడ్ టేపిజమ్ ఉక్కుపాదాల కింద నలిగిపోతున్న అనేకమంది కొత్తకొత్త ప్రతిభావంతులను చేరుకోవాలనే దిల్‌రాజు ప్రయత్నమే దిల్‌రాజు డ్రీమ్స్. దీనిని ఇంగ్లీషు భాష ప్రకారం దిల్‌రాజు కలలు అనొచ్చు, లేదా దిల్‌రాజు కల కంటున్నారు అని కూడా అనొచ్చు. ఏది ఏమైనా సారాంశం మాత్రం సమానం. పరిశ్రమలో ఆయన మరింత విస్తరించుకుంటున్నారు. ప్రజల వద్దకు పాలన వంటిదే ఇది. ఆర్ధాకలితో అలమటించిపోతున్నా, అరఠావు కాగితం దొరికినా తనదైన ఊహని కథగా రాసుకుందామని అలమటించిపోతున్న ఎందరో ఎందెరెందరో దిక్కులేని ప్రతిభావంతులకు దిల్‌రాజు ఇప్పుడు ఓ కొత్త గూడును నిర్మించారు.
డబ్బు సంపాదనే ధ్యేయమైతే క్రీమ్ అంతా దిల్‌రాజు దగ్గరే ఉంది. ఈ డ్రీమ్స్ అక్కర్లేదు. డాలర్ డ్రీమ్స్ తప్పితే క్రియేటివ్ డ్రీమ్స్ ఏమాత్రం పట్టని వారికి ఇది చోద్యంలా కనిపించొచ్చు. కానీ ఈ దిల్‌రాజు డ్రీమ్ అనే వేదిక ఓ కల్పవృక్షం, కామధేనువు. పుష్పకవిమానం.
ఒక్క భారతీయ చిత్ర పరిశ్రమలోనే కాదు, ప్రపంచ చలనచిత్ర గమనంలోనే ఈ ప్రయత్నం ఓ అపూర్వమైన బంగారు మైలురాయి. అవును దిల్‌రాజు కూడా ఓ మైలురాయి. ఎవ్వరూ అధిగమించలేని మైలురాయి…