SRD: నారాయణఖేడ్ RTC డిపో పరిధి బస్ స్టేషన్లో ఖాళీగా ఉన్న షాపులను అద్దెకు ఇచ్చేందుకు టెండర్లను ఆహ్వానిస్తున్నట్లు DM మల్లేశం శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఖేడ్లో 9, కంగ్టిలో 2, పెద్ద శంకరంపేటలో 5 షాపుల్లో పక్కా వ్యాపారం కొనసాగించేందుకు మే 29 లోపు టెండర్ ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. మే 30న సంగారెడ్డి ఆర్ఎం ఆఫీస్లో టెండర్ జరుగుతుందని చెప్పారు.