దర్శకుడు కనకమేడల వ్యవహారం చూస్తుంటే నిజమేననిపిస్తోంది. శుభమా అని భైరవం సినిమా ఈ నెల 30వ తేదీన విడుదల కాబోతూంటే, ఎప్పుడో అజ్ఞానంతో, అవివేకంతోనో, ఒళ్లు కొవ్వెక్కో చేసిన కోతిపని ఇప్పుడు కనకమేడల మెడకి పాముల చుట్టుకుని బుసలు కొట్టి, సెగలు కక్కుతోంది. ముందుకెళ్తే నుయ్యి, వెనక్కి వెళ్తే గొయ్యి అన్నట్టుగా కనకమేడల విజయ్‌కి చుక్కలు చూపిస్తోంది
పాపం వెంటాడక తప్పదు. చేసిన ఖర్మ వెంటాడుతూనే ఉంటుంది అని ఈ మధ్య యూ ట్యూబ్‌లో, రీల్స్‌లో తెగ వీడియాలో వైరల్ అవుతున్నాయి. దర్శకుడు కనకమేడల వ్యవహారం చూస్తుంటే నిజమేననిపిస్తోంది. శుభమా అని భైరవం సినిమా ఈ నెల 30వ తేదీన విడుదల కాబోతూంటే, ఎప్పుడో అజ్ఞానంతో, అవివేకంతోనో, ఒళ్లు కొవ్వెక్కో చేసిన కోతిపని ఇప్పుడు కనకమేడల మెడకి పాముల చుట్టుకుని బుసలు కొట్టి, సెగలు కక్కుతోంది. ముందుకెళ్తే నుయ్యి, వెనక్కి వెళ్తే గొయ్యి అన్నట్టుగా కనకమేడల విజయ్‌కి చుక్కలు చూపిస్తోంది.
చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లోకి విలీనం చేస్తున్న రోజులవి. ఇప్పుడంటే రోజులు మారాయి. కొన్ని కారణాల నేపథ్యంలో జనసేన, తెలుగుదేశం జతకట్టి, బిజెపి వెన్నుబలంతో జగన్‌ని చిత్తుగా ఓడించి అధికారంలోకి వచ్చాయి. పవన్ కళ్యాణ్దైతే చారిత్రాత్మక విజయం. పోటీ చేసిన స్థానాలన్నిటిలోనూ గెలుపుజెండా ఎగురవేయడంతో ప్రపంచప్రఖ్యాతి సాధించాడు పవన్ కళ్యాణ్. రాజకీయాలలోనూ పవర్ స్ఠార్ అనిపించుకున్నాడు. సాక్షాత్తూ నారా లోకేషే పవన్ కళ్యాణ్‌కి పాదాభివందనాలు సమర్పించుకోవడం ప్రపంచమంతా వీక్షించింది. అదీ మెగాబ్రదర్ ఎఛీవ్మెంట్
కానీ అప్పటి పరిస్థితి అది కాదు. తెలుగుదేశం గ్యాంగ్ అనుకున్నవారంతా చిరంజీవిని విపరీతంగా ట్రోల్ చేశారు. అదీ రామ్ చరణ్‌ని కూడా కలిపి చిరంజీవిని తెగ ఆడుకున్నారు. కాలం తెచ్చే మత్తైన మార్పులను మనుషులు పసిగట్టలేరు కదా అంటే అందుకు పాపం కనకమేడలే ప్రత్యక్ష ఉదాహరణ. చేతిలో సోషల్ మీడియా ఉంది కదా, అవకాశం ఉంది కదా చేతి దురద తీర్చుకునే సౌలభ్యం ఉంది కదా అని చేయి పారేసుకుంటే దాని పర్యవసానం ఇంత దారుణంగా ఉంటుందని సదరు ఈ కనకమేడల ఊహించలేక ఇప్పుడు అడ్డంగా బుక్ అయిపోయాడు. పవన్ కళ్యాణా ఇప్పుడు చంద్రబాబుకి ఆరోప్రాణంగా, అప్పట్లో ముక్కుపచ్చలారని పసివాడు రామ్ చరణ్ ఇప్పుడు జగదేకవీరుడయ్యాడు. మెగాకుటుంబానికే మకుటం లేని మహారాజయ్యాడు. సో అప్పుడు కనకమేడల చూపించిన పైత్యం ఇప్పుడు అతని మీద తోక తొక్కి, కొమ్ము చిమ్ముతోంది. 30న విడుదల కాబోతూన్న భైరవం చిత్రాన్ని బాయ్‌కాట్ అంటూ మెగాఫాన్స్ నిప్పులు చిమ్ముతున్నారు.
ఇదిలా ఉండగా మొన్నీ మధ్య ఏలూరులో జరిగిన ఫంక్షన్లో ఏదో వైయస్సార్ పార్టీకి తగిలేట్టుగా ఏదో మాట్లాడేశాడు. అంటే ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వంలో ఉంది కదా, నారా రోహిత్ కూడా భైరవంలో ప్రధానపాత్రను పోషిస్తున్నాడు కదా అనే ధీమాతో ఏదో వంకర మాటలు వెళ్ళగక్కాడు పాపం కనకమేడల. దానికి అసలే కుయ్యోమొర్రోమంటున్న వైయస్సార్ పార్టీ శ్రేణులు ఖస్సుమంటున్నారు. వాళ్ళు కూడా భైరవం బాయ్‌కాట్ అంటూ సోషల్‌మీడియాని హోరెత్తిస్తున్నారు. అంటే ఇప్పుడు కనకమేడల రెండింటికీ చెడ్డ రేవడి అన్నట్టుగా తయ్యారయ్యాడు.
ఇదే పరిస్థితి ఆ మధ్య లైలాకి కూడా ఎదురైంది. కాకతాళీయంగా నటుడు పృధ్వీ అన్న మాటలు లైలా బతుకుని బస్స్ స్టాండ్ చేసేశాయి. విష్వక్సేన్ ఎంత మొరపెట్టుకుని, కళ్ళనీళ్ళ పర్యంతమై సంజాయిషీలు చెప్పుకున్నా ప్రయోజనం లేకుండా పోయింది.
భైరవం చిత్రానిది కూడా లైలా దారేనా మరి. చూడాలి.