TPT: HYDకు చెందిన స్వర్గీయ IRS అధికారి వైసీపీ భాస్కర్ రావు తన వీలునామా ద్వారా టీటీడీకి రూ.3 కోట్ల విలువైన నివాస గృహం, రూ.66 లక్షల నగదు విరాళంగా అందజేశారు. ఇందులో భాగంగా వనస్థలిపురంలోని 3,500 చ.అ ‘ఆనంద నిలయం’ భవనాన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాల కోసం వాడుకోవాలని, నగదును టీటీడీ ట్రస్టులకు విభజించి అందించాలని పేర్కొన్నారు.