భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న నాలుగో టెస్టు రెండో రోజు ఆటకు వర్షం అంతరాయం కలిగించింది. దీంతో అంపైర్లు లంచ్ బ్రేక్ తీసుకున్నారు. ప్రస్తుతం భారత్ 6 వికెట్లు నష్టానికి 321 పరుగులు చేసింది. వాషింగ్టన్ సుందర్ (20), రిషభ్ పంత్ (39) క్రీజులో ఉన్నారు. ఈ సెషన్లో భారత్ జడేజా(20), శార్దూల్(41) వికెట్లను కోల్పోయింది.