ప్రకాశం: ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని ఏడిఏ బాలాజీ నాయక్ అన్నారు. గురువారం మార్కాపురం విశ్రాంత ఉద్యోగుల సంఘం భవనంలో మార్కాపురం వ్యవసాయ సబ్ డివిజన్ పరిధిలోని సిబ్బందికి 3రోజుల శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతి ఒక్క రైతుకు మేలు జరిగేలా సిబ్బంది పని చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ జిల్లా అధికారులు పాల్గొన్నారు.