ప్రకాశం: ఒంగోలులోని మాతా శిశు వైద్యశాలను జిల్లా కలెక్టర్ తమిమ్ అన్సారీయా శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్బంగా రోగులకు అందిస్తున్న వైద్య సేవలను, చేపడుతున్న పనుల గురించి వైద్య సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. వైద్యులు సకాలంలో ఉండి రోగులకు వైద్యం అందించాలని, విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.