VZM: గృహనిర్మాణ పథకాల కింద గతంలో ఇళ్ల స్థలాలు మంజూరై.. నేటికీ నిర్మాణాలు పూర్తిచేయని లబ్దిదారులంతా వెంటనే ఇళ్ల నిర్మాణాలు పూర్తిచేయాలని రాష్ట్ర గృహనిర్మాణ సంస్థ జనరల్ మేనేజర్ వెంకటరమణ సూచించారు. ప్రభుత్వం మంజూరు చేసిన అదనపు సహాయాన్ని వినియోగించుకొని లబ్దిదారులంతా తమకు కేటాయించిన ఇళ్ల నిర్మాణాలను పూర్తిచేసుకోవాలన్నారు.