HYD: ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడమే తమ ధ్యేయమని మలక్ పేట్ ఎమ్మెల్యే అహ్మద్ బలాల పేర్కొన్నారు. శుక్రవారం అజంపుర డివిజన్ డివిజన్ చంచల్ గూడ, ఖాల్లా తదితర ప్రాంతాలలో వివిధ శాఖల అధికారులతో కలిసి ఎమ్మెల్యే బలాల పర్యటించి స్థానిక ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ డ్రైనేజీ సమస్యలు తలెత్తకుండా తగిన చర్యలు తీసుకోవాలన్నారు.