వార్ టులో హృతిక్ రోషణ్ కాంబినేషణ్లో ఈక్వల్ రోల్‌ని అత్యధిక పారితోషకానికే సైన్ చేశాడు తారక్. హిందీ బాగా మాట్లాడగలడు. మంచి మాడ్యులేషన్ అన్నీ ఉన్న తారక్‌కి వార్ టు అంగీకరించడం పెద్ద సమస్య అనిపించలేదు.
త్రిబుల్ ఆర్ రిలీజైన తర్వాత రామ్ చరణ్‌కి, జూనియర్ ఎన్టీఆర్‌కి కూడా తిరుగులేని పేరు, ఇమేజ్ వచ్చేశాయి. కాకపోతే హిందీ అఫర్లని గానీ, హాలీవుడ్ ఆఫర్లని గానీ రామ్ చరణ్ అంగీకరించలేదు. ఇండియన్ ఫిల్మ్స పూర్తి చేస్తేగానీ చేయనని ఖరాఖండిగా హాలీవుడ్ బాబులకే చరణ్ కుండబద్దలు కొట్టేశాడు. ఏంటా రెండు ఇండియన్ ఫిల్మ్స్ అంటే అప్పుడు మేకింగ్‌లో ఉన్న గేమ్ ఛేంజర్, తర్వాత ప్రారంభం కానున్న పెద్ది. ఈ రెండు కంప్లీట్ అయితే అది హాలీవుడ్ అయినా, బాలీవుడ్ అయినా సరే రామ్ చరణ్ సున్నితంగా తిరస్కరించాడు.
అప్పటికే తారక్ హిందీ సినిమా కమిట్ అయ్యాడు. అదీ త్రిబుల్ ఆర్ ఎఫెక్టే. వార్ 2 లో హృతిక్ రోషణ్ కాంబినేషణ్ లో ఈక్వల్ రోల్‌ని అత్యధిక పారితోషకానికే సైన్ చేశాడు తారక్. హిందీ బాగా మాట్లాడగలడు. మంచి మాడ్యులేషన్ అన్నీ ఉన్న తారక్‌కి వార్ 2 అంగీకరించడం పెద్ద సమస్య అనిపించలేదు. పైగా త్రిబుల్ ఆర్ మైలేజ్ రామ్ చరణ్ కి వచ్చినంత తారక్ సొంతం చేసుకోలేకపోయాడనేది ట్రేడ్‌లో ఓ కామెంట్. ఆస్కార్ అవార్డు ఫంక్షన్‌కి కూడా తారక్ వెళ్ళ లేకపోయాడు. అప్పుడే జానకిరామ్ ప్రమాదంలో మరణించడం వంటి కారణాల వల్ల తారక్ ఆస్కార్ ఫంక్షన్‌కి దూరంగా ఉండాల్సి వచ్చింది. దాంతో ఆస్కార్ కవరేజ్‌లో రామ్ చరణ్ తప్పితే తారక్ ప్రజెన్సే లేదు.
అదిప్పుడు హాలీవుడ్ స్టాయిలో నిర్మాణమవుతున్న వార్ 2 చిత్రంలో తారక్ నటిస్తున్నాడు, హృతిక్‌తో పాటు సరిసమానమైన పాత్ర అనగానే తారక్ ఇమేజ్ అమాంతం పెరిగిపోయింది. పైగా తాజా చిత్రం దేవర కూడా అంత గొప్పగా ఆడకపోవడంతో వార్ 2 చిత్రం తారక్ పాలిట ఓ పెద్ద వరమైంది. మొన్నీ మధ్యన తారక్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన వార్ 2 ట్రైలర్ గూస్ బంప్స్ తెప్పించింది. ట్రైలర్ టైంని హృతిక్ రోషన్‌తో పాటుగా తారక్ కూడా చెరిసమానంగా పంచుకోవడంతో అందులో తారక్ ప్రాముఖ్యత ఎంతున్నాదన్నది అందరికీ చెప్పకనే చెప్పినట్టయింది.
వార్ 2 ని తారక్ డూ ఆర్ డైగా తీసుకున్నాడని తారక్ సన్నిహితులు గర్వంగా చెబుతున్నారు. ఎంత బైటకి భాయి భాయి అనుకున్నా సరే ప్రొఫెషనల్‌గా ఒకరిమీద మరొకరికి పోటీ ఉండకతప్పదు. రామ్ చరణ్ ఇమేజ్ ఎంతైనా తన కన్నా పెద్దదని, అది చిరంజీవి, పవన్ కళ్యాణ్ నేపథ్యాలతో మరింత స్ట్రాంగ్ తయారైందని, దాని ముందు తారక్ స్థాయి ఎంతో కొంత కురచగానే ఉన్నదన్న కామెంట్లు త్రిబుల్ ఆర్ టైంలోనే బాగా వినిపించాయి. అందుకే వచ్చిన జాతీయస్థాయి అవకాశాన్ని తారక్ డబుల్ ఎడ్వాంటేజ్కి వాడుకోబోతున్నాడనే విశ్లేషణ కూడా లేకపోలేదు. అందుకే తాడోపేడో తేల్చుకోవాలనే మూడ్‌లో తారక్ ఉన్నాడని తేటతెల్లమవుతోంది.