BDK: దుమ్ముగూడెం పర్ణశాలలో శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థాన పరిసరాల్లో ఉన్న సీతమ్మ వారి నార చీరల ప్రదేశం భారీ వర్షాల వరద ముంపునకు గురైంది. మండలంలో కురిసిన అతి భారీ వర్షాల కారణంగా సీతవాగు ఉప్పొంగి ప్రవహించడంతో ఈ చారిత్రక ప్రదేశం పూర్తిగా నీటిలో మునిగిపోయింది.