CTR: చిత్తూరులోని సాయుధ దళం కార్యాలయ మైదానంలో 100 మీటర్ల స్లో మోటార్ సైకిల్ రైడింగ్ నిర్వహించనున్నట్లు ట్రాఫిక్ సీఐ నిత్యబాబు తెలిపారు. ఆసక్తి గల వారు శనివారం సాయంత్రంలోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈ పోటీల్లో గెలుపొందిన వారికి నగదు బహుమతులుంటాయన్నారు. 18 సంవత్సరాలు నిండి డ్రైవింగ్ లైసెన్స్, పెండింగ్ చలానాలు ఉండని వ్యక్తులు అర్హులని ఆయన పేర్కొన్నారు.