ATP: అనంతపురం, కర్నూలు జిల్లాలకు చెందిన 24 మంది ఏఎస్సలకు ఎస్సైలుగా ఉద్యోగోన్నతి లభించింది. కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. నూతనంగా పదోన్నతి పొందిన వారికి కర్నూలు, నంద్యాల, తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లో పోస్టింగ్ ఇచ్చారు. 15 రోజుల్లో విధుల్లో చేరాలని డీఐజీ ఆదేశించారు.