ప్రకాశం: ప్రకాశం జిల్లాలో 74వేల బంగారు కుటుంబాలను గుర్తించామని, వాటికి స్థితిమంతులు చేయూతనివ్వాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా పిలుపునిచ్చారు. ఒంగోలు కలెక్టరేట్ సమావేశ మందిరంలో కాంట్రాక్టర్లతో సమావేశమయ్యారు. ప్రభుత్వం, ప్రజల సహకారంతో ఆకుటుంబాలకు వెన్నుదన్నుగా నిలవాలని కోరారు. తొలుత జడ్పీ సీఈవో పీ4 పథకంపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు.