ప్రకాశం: తర్లుపాడు MPDO చక్రపాణి తనతో అసభ్యంగా ప్రవర్తించారని ఓ మహిళ ఫిర్యాదు చేయగా పోలీస్ కేసు నమోదైంది. బాధితురాలి వివరాల మేరకు.. MPDO ఆఫీసులో అటెండర్‌గా పనిచేస్తున్న ఆమె చక్రపాణికి నీళ్లు ఇవ్వడానికి సోమవారం ఆయన రూముకు వెళ్లింది. ఆయన చేయిపట్టుకుని అసభ్యంగా ప్రవర్తించాడు. బుధవారం ఆఫీసుకు రాగా ఆమెను బాత్ రూములోకి లాక్కెళ్లేందుకు MPDO ప్రయత్నించారు.