AP: మాజీ సీఎం జగన్ వ్యాఖ్యలకు మంత్రి ఆనం రామనారాయణ కౌంటర్ ఇచ్చారు. వైసీపీ హయాంలో జరగని స్కామ్ లేదన్నారు. ‘వైసీపీ హయాంలో స్కామ్ వీరులు ఎక్కడున్నారో తెలియదు. అక్రమాల గురించి జగన్ మాట్లాడటం హాస్యాస్పదం. వెన్నుపోటు దినం అనడం ప్రజాతీర్పును అవమానించడమే’ అని పేర్కొన్నారు.