అనకాపల్లి: ప్రభుత్వం రేషన్ ఎండీయూ వాహనాలు రద్దు చేయడంపై డీలర్లు హర్షం వ్యక్తం చేశారు. శుక్రవారం డీలర్ అసోసియేషన్ ప్రతినిధులు జనసేన నర్సీపట్నం నియోజకవర్గ ఇంఛార్జ్ సూర్యచంద్రను కలిసి సన్మానించారు. సూర్యచంద్ర మాట్లాడుతూ.. గత ప్రభుత్వం డోర్ డెలివరీ పేరుతో అనాలోచితంగా తెచ్చిన రేషన్ వాహనాల వల్ల అనేక సమస్యలు వచ్చాయని ఇప్పుడు ఆ పరిస్థితి ఉండదన్నారు.