KKD: అన్నవరం వీర వెంకట సత్యనారాయణ స్వామిని సినీ నటుడు సాయికుమార్ ఆయన కుటుంబ సభ్యులతో కలిసి గురువారం సాయంత్రం దర్శించుకున్నారు. క్షేత్రానికి చేరుకున్న సినీ నటుడుకు అన్నవరం ఈవో సుబ్బారావు స్వాగతం పలికారు. అనంతరం సత్యదేవునిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. వేద పండితుల ఆశీర్వచనాలు అందజేశారు. స్వామివారి ఫొటోను అధికారులు వారికి ఇచ్చారు.