అల్లూరి: అడ్డతీగల మండలం నాయుడుపాకలు గ్రామ సమీపంలో ఆర్అండ్బీ అధీనంలో ఉన్న పురాతనమైన చెట్లను కొంతమంది యథేచ్ఛగా నరికివేస్తున్నారు. అయినా సంబంధిత అధికారులు చోద్యం చూస్తున్నారు. విలువైన భారీ వృక్షాలను కొంతమంది దళారులు పట్టపగలే నరికివేస్తున్నారని పలువురు అంటున్నారు. ఇప్పటికైనా ఆర్అండ్బీ అధికారులు స్పందించాలని కోరుతున్నారు.