ADB: ఇచ్చోడ మండల కేంద్రానికి చెందిన ఏనుగు సరితకు మంజూరు అయిన రూ. 3 లక్షల CMRF చెక్కును ఎమ్మెల్యే అనిల్ జాదవ్ శుక్రవారం అందజేశారు. వైద్య ఖర్చుల వివరాలను ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సమర్పించి సీఎంఆర్ఎఫ్ ద్వారా లబ్ధి పొందాలని ప్రజలకు సూచించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల నాయకులు, కార్యకర్తలు, స్థానికులు, తదితరులు ఉన్నారు.