NRML: భైంసా పట్టణంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో నిర్వహిస్తున్న ఉపాధ్యాయుల శిక్షణ కేంద్రాన్ని శుక్రవారం ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. శిక్షణలో నేర్చుకున్న అంశాలను ఉపాధ్యాయులు విద్యార్థులకు అర్థమయ్యేలా బోధించాలని, వారి భవిష్యత్తుకు పునాదులు వేయాలని సూచించారు. డీఈవో రామారావు తదితరులున్నారు.