ప్రకాశం: మార్కాపురం మండలం చింతకుంట పరిధిలోని రామిరెడ్డినగర్లో గురువారం రాత్రి విద్యుత్ షాక్కు గురై 19గేదెలు మృతి చెందాయని స్థానికులు తెలిపారు. పొలంలో విద్యుత్ వైర్లు తెగి పడడంతో గేదెలకు కరెంట్ షాక్ తగిలి మృతి చెందినట్లు చెబుతున్నారు. సుమారు రూ. 13 లక్షల నష్టం జరిగిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు.