HYD: ఇంటిని అద్దెకిస్తున్న ఓనర్లకు హెచ్చరిక. ఇటీవల TO-LET బోర్డు పెట్టిన సికింద్రాబాద్కు చెందిన ఓ మహిళ మోసపోయింది. అడ్వాన్స్ చెల్లిస్తానని నమ్మించిన ఓసై బర్ నేరగాడు ‘Reverse Mode Payment’ పేరిట రూ.1.31 లక్షలు కొట్టేశాడు. ఓనర్ అకౌంట్లోనే ఆ డబ్బులు పడతాయని చెప్పి ముఖం చాటేశాడు. దిక్కుతోచని స్థితిలో బాధితురాలు CCSను ఆశ్రయించింది. దీంతో అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.