VSP: సింహాచలం చందనోత్సవంలో గోడకూలిన ఘటన తనను ఎంతగానో కాలచివేసిందని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తియాదవ్ గురువారం అన్నారు. మద్దిలపాలెం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ.. కొంతమంది అవినీతి అధికారులు సింహాచల దేవస్థానంలో తిష్టవేసుకుని ఉన్నారని, అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు.