విజయవాడ పటమటలో ద్విచక్ర వాహనల దొంగలను పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.10లక్షల విలువ చేసే 16 బైక్లను స్వాధీనం చేసుకున్నట్లు ఏసీపీ దామోదర్ తెలిపారు. వాహన తనిఖీల్లో భాగంగా అనుమానస్పదంగా ప్రవర్తించిన ఇద్దరు దొంగలను అదుపులోకి తీసుకున్నామని ఏసీపీ చెప్పారు. దుండగులు మోపిదేవికి చెందిన ప్రసాద్, కానూరుకు చెందిన రబ్బానీగా గుర్తించామన్నారు.