ప్రకాశం: కుట్టుమిషన్ శిక్షణ ద్వారా మహిళలకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి అన్నారు. పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో సీడప్ స్కిల్ కాలేజీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కుట్టు మిషన్ శిక్షణ ఉపాధి అవకాశాల పోస్టర్ను గురువారం ఎమ్మెల్యే ఆవిష్కరించారు. మహిళలకు ఉచితంగా కుట్టు శిక్షణ ఇచ్చి, వారికి మిషన్లను కూడా ప్రభుత్వమే అందజేస్తుందన్నారు.