AP: YCP నేత వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. కేసు పూర్తి వివరాలు సమర్పించాలని పోలీసులకు హైకోర్టు ఆదేశించింది. అనంతరం విచారణను వారం రోజులకు వాయిదా వేసింది. దిగువ కోర్టు బెయిల్‌కు నిరాకరణతో హైకోర్టులో వంశీ పిటిషన్ వేసిన విషయం తెలిసిందే.
TG: HCU భూములపై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక ఆదేశాలిచ్చింది. ఇవాళ మధ్యాహ్నం 3:30 గంటలకు నివేదిక అందించాలని తెలంగాణ హైకోర్టు రిజిస్ట్రార్‌కు చెప్పింది. ప్రభుత్వం విక్రయించాలనుకున్న భూములు సందర్శించి నివేదిక ఇవ్వాలని తెలిపింది. హైకోర్టు ఆదేశాలపై స్టే ఇవ్వటం లేదన్న సుప్రీం.. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు అక్కడ ఎలాంటి చర్యలు చేపట్టవద్దని పేర్కొంది.
NGKL: జిల్లాలో ఏదో ఒక చోట అత్యాచారం హత్యలు లాంటి ఘటనలు వెలుగుచూస్తున్నాయని స్థానికులు అంటున్నారు. ఊర్కొండ దేవాలయం సమీపంలో వివాహితపై ఏడుగురు సామూహిక అత్యాచారానికి కారణం మద్యం అని పోలీసులు నిర్ధారించారు. గ్రామాలలో విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు కొనసాగుతున్నాయి. మద్యం డ్రగ్స్ వల్లే జిల్లాలో రోజురోజుకు అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయని అభిప్రాయం వ్యక్తమవుతోంది.
SDR: బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా 9సారి విష్ణువర్ధన్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అంబేడ్కర్ సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడు జగన్ ఆధ్వర్యంలో విష్ణువర్ధన్ రెడ్డిని జిల్లా కోర్టు ఆవరణలో బుధవారం ఘనంగా సన్మానించారు. దళిత జర్నలిస్ట్ ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షుడు యాదగిరి, బ్యాక్వర్డ్ బీసీ సంఘాల జిల్లా అధ్యక్షుడు హనుమంతు, సురేశ్, తరుణ్ తదితరులు పాల్గొన్నారు.
మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసులో ఛత్తీస్‌గఢ్ మాజీ సీఎం, కాంగ్రెస్ నేత భూపేశ్ బఘేల్‌పై CBI ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. బెట్టింగ్ యాప్ కుంభకోణం లబ్దిదారుల్లో బఘేల్ ఒకరని తెలిపింది. గతంలో ఈడీ కూడా తన FIRలో ఇదే విషయాన్ని పేర్కొంది. అయితే 19 నిందితుల్లో బఘేల్‌ను ఆరో వ్యక్తిగా పేర్కొంది. కాగా, రాజకీయంగా తనను ఎదుర్కోలేకే కేసులు పెడుతున్నారని బఘేల్ విమర్శించారు.
ప్రకాశం: ఇంటర్ సెకండియర్ విద్యార్థులకు కాంపిటేటివ్ పరీక్షలకు శిక్షణ పొందటానికి ఎర్రగొండపాలెం ప్రభుత్వ జూనియర్ కళాశాలను ఎంపిక చేసినట్లుగా అధికారులు వెల్లడించారు. JEE, NEET, EAMCET, IIT పరీక్షలు ఇంటర్ సెకండియర్ విద్యార్థులకు ఉండటంతో ఆయా పరీక్షలకు శిక్షణ పొందే విద్యార్థులకు ఎర్రగొండపాలెం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శిక్షణ ఇస్తున్నారు.
బాపట్ల: ఇటీవల ప్రమాదవశాత్తూ మరణించిన వేటపాలెం మండలం అనుమల్లిపేటకి చెందిన జనసేన పార్టీ క్రియాశీల కార్యకర్త చల్లా పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యులకు పరిస సాయి, వినయ్ గౌడ్, పసుపులేటి సాయి తదితర జన సైనికులు బుధవారం 10వేల రూపాయల ఆర్థిక సాయం అందించారు. కళ్యాణ్ కుటుంబానికి జనసేన పార్టీ ఎల్లవేళలా, అన్ని విధాలా అండగా ఉంటుందని కూడా వారు హామీ ఇచ్చారు.
WNL: వసంత నవరాత్రి మహోత్సవములు సందర్భంగా శ్రీ భద్రకాళి అమ్మవారికి లక్ష మల్లెపూలతో అర్చన చేశారు. వరంగల్‌లో భక్తుల కొంగుబంగారంగా విరాజిల్లుతున్న శ్రీ భద్రకాళి అమ్మవారి వసంత నవరాత్రి మహోత్సవం ఘనంగా జరుగుతున్నాయి. నాల్గో రోజు అమ్మవారికి లక్ష మల్లెపూలతో అర్చన చేశారు. మల్లెపూలతో అమ్మవారికి అర్చన చేస్తే ప్రశాంతమైన జీవితం గడుపుతారని అర్చకులు తెలిపారు.
KRNL: జొన్నగిరి పోలీస్ స్టేషన్ నూతన సబ్ ఇన్‌స్పెక్టర్‌గా సి.మల్లికార్జున బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ.. శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేస్తామన్నారు. ఎవరైనా చట్టాన్ని అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఇక్కడ పనిచేస్తున్న ఎస్ఐ జయశేఖర్ ఆదోని త్రీ టౌన్ పోలీసు స్టేషన్‌కు బదిలీపై వెళ్లారు.
కర్నూలు: వెల్దుర్తి, క్రిష్ణగిరి అంగన్వాడీ టీచర్స్ బుధవారం సీడీపీవో లుక్‌కు పని ఒత్తిడి తగ్గించాలని వినతి పత్రం అందజేశారు. వారు మాట్లాడుతూ.. బాల సంజీవని 2.0 కొత్త వర్షన్ నిబంధనలను అంగన్వాడీ యూనియన్లు వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. రెగ్యులర్ ఉద్యోగస్తులకు అమలు చేయవలసిన పనులు అంగన్వాడీ సిబ్బందికి చెప్పడం పని ఒత్తిడి అవుతుందని తెలిపారు.
కర్నూలు: ఆదోని పట్టణంలో బుధవారం బార్ అసోసియేషన్ ఎన్నికలు రసవత్తరంగా జరిగాయి. ప్రెసిడెంట్‌గా వీ.శ్రీరాములు 101 మెజారిటీతో వైస్ ప్రెసిడెంట్‌గా జే వెంకటేశులు 186 మెజారిటీతో అలాగే జనరల్ సెక్రటరీ ఎల్ కె జీవన్ సింగ్ 109 మెజారిటీతో గెలుపొందారు. జాయింట్ సెక్రటరీగా పి రాజారత్నం 49 మెజారిటీతో ప్రత్యర్థులపై గెలుపొందారు. గెలుపొందిన వారికి బార్ అసోసియేషన్ సభ్యులు సన్మానించారు.
VZM: తెర్లాం మండలంలో సింగిరెడ్డివలస రెవిన్యూ పరిధిలో తోటపల్లి కాలువ నిర్మాణం చేపడితే పలు గ్రామాలకు సంబంధించి సుమారు 1500 – 2000 ఎకరాల భూమికి సాగునీటి సదుపాయం కల్పించవచ్చని రైతులు ఎమ్మెల్యేకు తెలిపారు. ఈ మేరకు బుధవారం ఆయన ఆ ప్రాంతాలను పరిశీలించి, ఇరిగేషన్ మంత్రికి తోటపల్లి కాలువ నిర్మాణ ఆవశ్యకతను వివరించి వీలైనంత త్వరగా మంజూరు చేసేలా ప్రయత్నిస్తానన్నారు.
AP: మెగాస్టార్ చిరంజీవిని ఆయన సోదరుడు, ఎమ్మెల్సీ నాగబాబు మర్యాదపూర్వకంగా కలిశారు. శాసనమండలి ఛైర్మన్ కార్యాలయంలో ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం నాగబాబు చిరంజీవిని కలిశారు. ఈ సందర్బంగా చిరంజీవి నాగబాబును అభినందించారు. అలాగే, అభినందనలు తెలియజేస్తూ చిరంజీవి సోషల్ మీడియాలో ఫొటో పంచుకున్నారు.
SRPT: జిల్లాలో 4549 ఇందిరమ్మ ఇళ్ల మంజూరు చేయడం జరిగిందని కలెక్టర్ తేజస్ తెలిపారు. కలెక్టర్ కార్యాలయంలో మాట్లాడుతూ.. ఎంపీడీవోలు, హౌసింగ్ అధికారులు సమన్వయంతో పనిచేయాలని, అర్హత ఉన్నవారికి మంజూరి అయ్యేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా జరిగిన పనుల వివరాలు, మిగిలిన నిధులను నివేదిక ద్వారా సమర్పించాలని కలెక్టర్ ఆదేశించారు.