• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

జిల్లాకు 4549 ఇందిరమ్మ ఇండ్ల మంజూరు: కలెక్టర్

SRPT: జిల్లాలో 4549 ఇందిరమ్మ ఇళ్ల మంజూరు చేయడం జరిగిందని కలెక్టర్ తేజస్ తెలిపారు. కలెక్టర్ కార్యాలయంలో మాట్లాడుతూ.. ఎంపీడీవోలు, హౌసింగ్ అధికారులు సమన్వయంతో పనిచేయాలని, అర్హత ఉన్నవారికి మంజూరి అయ్యేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా జరిగిన పనుల వివరాలు, మిగిలిన నిధులను నివేదిక ద్వారా సమర్పించాలని కలెక్టర్ ఆదేశించారు.

April 2, 2025 / 08:21 PM IST

ప్రమాణ స్వీకారం చేసిన నూతన ఎమ్మెల్సీ 

GNTR: గుంటూరు, కృష్ణా జిల్లాల పట్టుభద్రుల ఎమ్మెల్సీగా ఆలపాటి రాజేంద్రప్రసాద్ బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. అమరావతిలో శాసనమండలి ఛైర్మన్ ఆలపాటి చేత ప్రమాణం చేయించారు. ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు తదితర నేతలు రాజేంద్రప్రసాద్‌ని అభినందించారు. పట్టభద్రుల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తానని ఆలపాటి వెల్లడించారు.

April 2, 2025 / 08:14 PM IST

కృష్ణంపాడులో మద్యం పట్టివేత

NLR: జలదంకి మండలం కృష్ణంపాడులో ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ అధికారులు దాడులు నిర్వహించారు. సీఐ సుంకర శ్రీనివాసులు సూచనల మేరకు ఎస్సై దేవిక సిబ్బందితో కలిసి తనిఖీలు చేశారు. అనధికారికంగా మద్యం విక్రయిస్తున్న గోని అశోక్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతడి నుంచి పది మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు నిందితుడిపై కేసు నమోదు చేశారు.

April 2, 2025 / 08:14 PM IST

ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేసిన ఎంఈవో

PPM: ఎమ్మెల్యే విజయ్ చంద్రతో రాష్ట్ర ఎంఈవో అసోషియేషన్ అధ్యక్షులు సాముల సింహాచలం బుధవారం మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఎంఈవోలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి వాటి పరిష్కారానికి కృషి చేయాలని వినతి పత్రాన్ని అందజేశారు. ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి, విద్యాశాఖ మంత్రి దృట్టికి తీసుకు వెళ్తానని హమీ ఇచ్చారు.

April 2, 2025 / 08:14 PM IST

ఉన్నతి ప్రోగ్రాంకు 108మంది ఎంపిక

ASR: కొయ్యూరు ఎంపీడీవో కార్యాలయంలో బుధవారం నిర్వహించిన ఉన్నతి ప్రోగ్రాంకు 108మంది అభ్యర్థులు ఎంపికయ్యారని ఏపీవో టీ.అప్పలరాజు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో ఎస్కేవీ ప్రసాద్, చింతపల్లి ఏపీడీ లాలం సీతయ్య పాల్గొని, మండలానికి చెందిన 10వ తరగతి పాసైన అభ్యర్థులను ఎంపిక చేశామన్నారు. ఎంపికైన అభ్యర్థులకు నైపుణ్య శిక్షణ అందించి, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు.

April 2, 2025 / 08:14 PM IST

పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులతో సమీక్ష

ELR: ఏలూరు జిల్లా పరిషత్ కార్యాలయంలో ఉమ్మడి ప.గో.జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ ఘంటా పద్మ శ్రీ ప్రసాద్ బుధవారం ఉంగుటూరు, దెందులూరు నియోజకవర్గల పంచాయతీ రాజ్ ఇంజనీర్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా పరిషత్ నుంచి విడుదల చేసిన పనుల పురోగతిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.

April 2, 2025 / 08:10 PM IST

విద్యకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తుంది

SKLM: విద్యకు కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి అన్నారు. బుధవారం పోలాకి మండలం మబగాం జిల్లా పరిషత్ పాఠశాలలో ఏర్పాటు చేసిన వార్షికోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. పదవతరగతి పరీక్షలు వ్రాసి రిలీవ్ అవుతున్న విద్యార్థినీ విద్యార్థులు విద్యపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.

April 2, 2025 / 08:10 PM IST

మైనార్టీలకు వైసీపీ అండగా ఉంటుంది: ఎంపీ

CTR: వర్ఫ్ సవరణ బిల్లుకు వైసీపీ వ్యతిరేకమని రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి స్పష్టం చేశారు. ఇవాళ పార్లమెంట్‌లో ఈ బిల్లు ప్రవేశపెట్టగా ఆయన మాట్లాడారు. మైనారిటీ సమాజానికి వైసీపీ అండగా ఉంటుదని చెప్పారు. వక్స్ ఆస్తుల విషయంలో ప్రభుత్వాల జోక్యం అనవసరమని తేల్చిచెప్పారు.

April 2, 2025 / 08:07 PM IST

వసతి గృహాల్లో భద్రతా చర్యలు చేపట్టాలి

GNTR: ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలు, వసతీ గృహాల్లో బాల, బాలికలు, మహిళలపై నేరాల నియంత్రణ కోసం ముందస్తు భద్రతా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ నాగలక్ష్మీ సూచించారు. బుధవారం గుంటూరు కలెక్టరేట్ కార్యాలయంలో ఎస్పీ సతీశ్ కుమార్‌తో కలిసి ఆమె సమీక్ష నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. వసతీ గృహాల స్వాగత ద్వారాల వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని సూచించారు.

April 2, 2025 / 07:51 PM IST

సన్నబియ్యం పంపిణీని పరిశీలించిన కలెక్టర్ తేజస్

SRPT: సూర్యాపేటలో రేషన్ షాప్ నెం 14ను జిల్లా కలెక్టర్ తేజస్ పరిశీలించారు. కలెక్టర్ లబ్ధిదారులతో బియ్యం నాణ్యత బాగుందా అని అడిగి తెలుసుకున్నారు. రేషన్ షాప్ లో ఉన్న స్టాక్, బియ్యం నాణ్యత, ఈ పాస్ మిషన్‌లో జరుగుతున్న లావాదేవీలు పరిశీలించారు. రెండు రోజులలో 1.24 లక్షల మంది లబ్ధిదారులకి 2500 మెట్రిక్ టన్నుల పంపిణి చేయటం జరిగిందని పేర్కొన్నారు.

April 2, 2025 / 07:50 PM IST

రోడ్డు ప్రమాదాల నియంత్రణకు చర్యలు

SRPT: రహదారి ప్రమాదాల నియంత్రణకు ప్రతి ఒక్కరు సహకరించాలని సూర్యపేట పట్టణ ట్రాఫిక్ ఎస్సై సాయిరాం సూచించారు. సూర్యాపేట వాహన చోదకులకు రాంగ్ రూట్ ట్రాఫిక్ నిబంధనలు పలు వాటిపై ఎస్సై ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. గత పది రోజుల్లో రాంగ్ ప్రయాణం చేసిన 150 మంది వాహన చోదకులకు జరిమానాలు విధించడం జరిగిందని తెలిపారు.

April 2, 2025 / 07:43 PM IST

రాజీవ్ యువ వికాస పథకం దరఖాస్తులు తేదీ పొడిగింపు

BHNG: రాజీవ్ యువ వికాస పథకం కింద దరఖాస్తు చేసుకునే ఈనెల 14 వరకు పొడగించినందున.. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని యాదాద్రి భువనగిరి రెవిన్యూ అదనపు కలెక్టర్ వీరారెడ్డి అన్నారు. బుధవారం కలెక్టరేట్ సమావేశంలో జిల్లాలోని మండల పరిషత్ అభివృద్ది అధికారులు, మున్సిపల్ కమీషనర్లు, MPDO లతో సమావేశము ఏర్పాటు చేసి రాజీవ్ యువ వికాసం పథకం అమలు చేయుటకు సూచనలు చేశారు.

April 2, 2025 / 07:38 PM IST

ఘనంగా ఆటిజం అవగాహన దినోత్సవం

CTR: పూతలపట్టు భవిత కేంద్రంలో ఆటిజం అవగాహన దినోత్సవాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. ఎంఈవోలు వాసుదేవన్, మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ.. బుద్ధి మాంధ్యం పిల్లలతో తల్లితండ్రులు ఎక్కువ సమయం గడపాలన్నారు. వారిని ఏకాంతంలో వదలకుండా నలుగురిలో కలిసేలా చూడాలని సూచించారు. తద్వారా వారిలో మానసిక బుద్ధి వికాసం ఏర్పడి, సమాజంలో ఉత్తమ పౌరులుగా ఎదుగుతారన్నారు.

April 2, 2025 / 07:03 PM IST

చవటగుంటలో చలివేంద్రం ఏర్పాటు

CTR: వెదురుకుప్పం మండలం చవటగుంట వద్ద ఎస్సై వెంకటసుబ్బయ్య ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. దీనిని బుధవారం ప్రారంభించారు. ఎస్సై మాట్లాడుతూ.. ప్రయాణికులు, ప్రజల దాహాన్ని తీర్చడానికి పోలీసుల ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేశామని చెప్పారు.

April 2, 2025 / 07:00 PM IST

మహనీయుల జయంతి ఉత్సవాల స్టిక్కర్లు ఆవిష్కరణ

BHNG: ఈనెల 5 నుంచి 14 వరకు వరకు జరిగే మహనీయులు బాబు జగ్జీవన్ రామ్, మహాత్మా జ్యోతిరావు పూలే, బాబాసాహెబ్ అంబేద్కర్ గార్ల జయంతి ఉత్సవాలను సామరస్యపూర్వహక వాతావరణంలో జరుపుకోవాలని డీసీపీ ఆకాంక్ష్ యాదవ్ అన్నారు. మహనీయుల జయంతోత్సవాల కమిటీ ఆధ్వర్యంలో బుధవారం డీసీపీని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఉత్సవాల స్టిక్కర్లను డీసీపీ ఆవిష్కరించారు.

April 2, 2025 / 06:45 PM IST