• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

రోడ్డు ప్రమాదాల నియంత్రణకు చర్యలు

SRPT: రహదారి ప్రమాదాల నియంత్రణకు ప్రతి ఒక్కరు సహకరించాలని సూర్యపేట పట్టణ ట్రాఫిక్ ఎస్సై సాయిరాం సూచించారు. సూర్యాపేట వాహన చోదకులకు రాంగ్ రూట్ ట్రాఫిక్ నిబంధనలు పలు వాటిపై ఎస్సై ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. గత పది రోజుల్లో రాంగ్ ప్రయాణం చేసిన 150 మంది వాహన చోదకులకు జరిమానాలు విధించడం జరిగిందని తెలిపారు.

April 2, 2025 / 07:43 PM IST

రాజీవ్ యువ వికాస పథకం దరఖాస్తులు తేదీ పొడిగింపు

BHNG: రాజీవ్ యువ వికాస పథకం కింద దరఖాస్తు చేసుకునే ఈనెల 14 వరకు పొడగించినందున.. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని యాదాద్రి భువనగిరి రెవిన్యూ అదనపు కలెక్టర్ వీరారెడ్డి అన్నారు. బుధవారం కలెక్టరేట్ సమావేశంలో జిల్లాలోని మండల పరిషత్ అభివృద్ది అధికారులు, మున్సిపల్ కమీషనర్లు, MPDO లతో సమావేశము ఏర్పాటు చేసి రాజీవ్ యువ వికాసం పథకం అమలు చేయుటకు సూచనలు చేశారు.

April 2, 2025 / 07:38 PM IST

ఘనంగా ఆటిజం అవగాహన దినోత్సవం

CTR: పూతలపట్టు భవిత కేంద్రంలో ఆటిజం అవగాహన దినోత్సవాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. ఎంఈవోలు వాసుదేవన్, మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ.. బుద్ధి మాంధ్యం పిల్లలతో తల్లితండ్రులు ఎక్కువ సమయం గడపాలన్నారు. వారిని ఏకాంతంలో వదలకుండా నలుగురిలో కలిసేలా చూడాలని సూచించారు. తద్వారా వారిలో మానసిక బుద్ధి వికాసం ఏర్పడి, సమాజంలో ఉత్తమ పౌరులుగా ఎదుగుతారన్నారు.

April 2, 2025 / 07:03 PM IST

చవటగుంటలో చలివేంద్రం ఏర్పాటు

CTR: వెదురుకుప్పం మండలం చవటగుంట వద్ద ఎస్సై వెంకటసుబ్బయ్య ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. దీనిని బుధవారం ప్రారంభించారు. ఎస్సై మాట్లాడుతూ.. ప్రయాణికులు, ప్రజల దాహాన్ని తీర్చడానికి పోలీసుల ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేశామని చెప్పారు.

April 2, 2025 / 07:00 PM IST

మహనీయుల జయంతి ఉత్సవాల స్టిక్కర్లు ఆవిష్కరణ

BHNG: ఈనెల 5 నుంచి 14 వరకు వరకు జరిగే మహనీయులు బాబు జగ్జీవన్ రామ్, మహాత్మా జ్యోతిరావు పూలే, బాబాసాహెబ్ అంబేద్కర్ గార్ల జయంతి ఉత్సవాలను సామరస్యపూర్వహక వాతావరణంలో జరుపుకోవాలని డీసీపీ ఆకాంక్ష్ యాదవ్ అన్నారు. మహనీయుల జయంతోత్సవాల కమిటీ ఆధ్వర్యంలో బుధవారం డీసీపీని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఉత్సవాల స్టిక్కర్లను డీసీపీ ఆవిష్కరించారు.

April 2, 2025 / 06:45 PM IST

‘ఒకే దేశం- ఒకే ఎన్నికతో దేశానికి మేలు’

SRPT: ఒకే దేశం-ఒకే ఎన్నిక కార్యక్రమంతో దేశానికి ప్రయోజనం కలుగుతుందని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లెపాక సాయిబాబా అన్నారు. బుధవారం తుంగతుర్తి మండలంలోని బండరామారం, సూర్యతండా, మంచ్యతండాలో ఒకే దేశం-ఒకే ఎన్నికపై నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. దేశ ప్రయోజనమే ప్రధాని మోడీ లక్ష్యమన్నారు.

April 2, 2025 / 06:42 PM IST

“బాబు జగ్జీవన్ రామ్, అంబేద్కర్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహిద్దాం”

MBNR: బాబు జగ్జీవన్ రామ్ డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ప్రతి ఒక్కరు సహకరించాలని జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి కోరారు. ఏప్రిల్ 5వ తేదీన జగ్జీవన్ రామ్ 14వ తేదీన అంబేద్కర్ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని కలెక్టరేట్లో బుధవారం సంబంధిత సంఘాల ప్రతినిధులు అధికారులతో సమావేశం అయ్యారు.

April 2, 2025 / 06:11 PM IST

లబ్ధిదారులకు సన్న బియ్యం పంపిణీ చేసిన ఎమ్మెల్యే

NLG: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సన్న బియ్యం పంపిణీ కార్యక్రమంలో భాగంగా, బుధవారం నార్కట్ పల్లి పట్టణంలోని మాండ్ర రోడ్డులోని చౌకధరల దుకాణం వద్ద.. నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం లబ్ధిదారులకు సన్న బియ్యం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సన్న బియ్యం పంపిణీ అనేది పేదలకు శుభపరిణామం అని చెప్పారు. మండల అధికారులు, మండల కాంగ్రెస్ నాయకులు ఉన్నారు.

April 2, 2025 / 05:46 PM IST

నీటి కోసం రోడ్డెక్కిన మహిళలు

NLG: చౌటుప్పల్ పట్టణంలో మంచినీటి సమస్యపై BJP మండల శాఖ అధ్యక్షురాలు కడారి కల్పన నాయకత్వంలో, స్థానిక మహిళలంతా ఖాళీ బిందెలతో బుధవారం రోడ్డెక్కారు. పట్టణంలోని మంచినీటి సమస్యను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జాతీయ రహదారిపై నిరసన తెలిపారు. BJP రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంగిడి మనోహర్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి నిరసనలో పాల్గొన్నారు.

April 2, 2025 / 05:27 PM IST

BREAKING: ప్రేమోన్మాది నవీన్ అరెస్టు

AP: విశాఖలోని మధురవాడలో ప్రేమోన్మాది నవీన్ తల్లి, కూతురిపై దాడి చేసిన ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన విషయం తెలిసిందే. అయితే, ఈ దాడికి పాల్పడిన నవీన్‌ను పోలీసులు శ్రీకాకుళం సమీపంలో అరెస్టు చేశారు. దాడి చేసి ద్విచక్రవాహనంపై వెళ్తుండగా పోలీసులు పట్టుకున్నట్లు సమాచారం. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు, హోంమంత్రి సీరియస్ తీసుకున్నారు.

April 2, 2025 / 05:27 PM IST

వ్యాధుల నియంత్రణకు పటిష్టమైన చర్యలు చేపట్టాలి

ASR: కీటక జనిత వ్యాధుల నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ ఆదేశించారు. జాతీయ కీటక జనిత వ్యాధుల నియంత్రణ కార్యక్రమం కింద పలు శాఖల అధికారులతో కీటక జనిత వ్యాధుల నియంత్రణపై కలెక్టరేట్‌లో బుధవారం సమావేశం నిర్వహించారు. గత ఏడాది చేపట్టిన మలేరియా నివారణ చర్యలపై ఆరా తీశారు. జిల్లాలో మలేరియా, డెంగ్యూ మరణాలు జరగకూడదన్నారు.

April 2, 2025 / 05:19 PM IST

టీటీడీ సేవల్లో మార్పు కనిపించాలి: CM చంద్రబాబు

AP: టీటీడీ సేవలు, సౌకర్యాల్లో వంద శాతం మార్పు కనిపించాలని CM చంద్రబాబు అధికారులకు సూచించారు. తిరుమలలో సేవలు బాగుంటేనే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందన్నారు. అభివృద్ధి పనుల పేరుతో టీటీడీ ఇష్టం వచ్చినట్లు ఖర్చు పెట్టొదన్నారు. టీటీడీలో మనం ధర్మకర్తలం, నిమిత్తమాత్రులమని పేర్కొన్నారు. వచ్చే 50 ఏళ్లు అవసరాలకు అనుగుణంగా టీటీడీని తీర్చిదిద్దాలని వెల్లడించారు.

April 2, 2025 / 05:19 PM IST

ప్రజా సమస్యలు పరిష్కారానికి మొదట ప్రాధాన్యత

SKLM: ప్రజా సమస్యలు పరిష్కారానికి మొదట ప్రాధాన్యత అని పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు అన్నారు. బుధవారం ఆయన క్యాంప్ కార్యాలయంలో ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో నియోజకవర్గంలో ఉన్న ప్రజల నుండి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి కార్యకర్తను కలిసి సమస్యలు తెలుసుకొని పరిష్కరిస్తామని అన్నారు.

April 2, 2025 / 05:16 PM IST

గాంధీజీ ముని మనవరాలు మృతి

మహాత్మా గాంధీ కుటుంబంలో విషాదం నెలకొంది. గాంధీజీ ముని మనవరాలు నీలంబెన్ పారిఖ్(93) మృతి చెందారు. వృద్ధాప్య సమస్యలతో ఆమె నిన్న గుజరాత్‌లోని నవ్‌సరిలో తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆమె అంత్యక్రియలు ఈరోజు వీర్వాల్ శ్మశానవాటికలో జరుగుతాయని వెల్లడించారు. నీలంబెన్ మృతిపట్ల పలువురు సంతాపం వ్యక్తం చేశారు.

April 2, 2025 / 05:14 PM IST

అర్హులైన అందరికీ రాయితీ రుణాలు

GNTR: ప్రభుత్వం అందించే కార్పొరేషన్ రాయితీ రుణాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందుతాయని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి తెలిపారు. బుధవారం టీడీపీ కార్యాలయంలో ప్రజా గ్రీవెన్స్ డేలో ఆమె ప్రజల ఫిర్యాదులను స్వీకరించారు. గుంటూరు కొరిటెపాడు ప్రాంతానికి చెందిన మహిళలు చిట్టీల మోసంపై న్యాయం కోరగా, పోలీసులు చర్యలు తీసుకునేలా చూస్తానని హామీ ఇచ్చారు.

April 2, 2025 / 05:14 PM IST