మహాత్మా గాంధీ కుటుంబంలో విషాదం నెలకొంది. గాంధీజీ ముని మనవరాలు నీలంబెన్ పారిఖ్(93) మృతి చెందారు. వృద్ధాప్య సమస్యలతో ఆమె నిన్న గుజరాత్లోని నవ్సరిలో తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆమె అంత్యక్రియలు ఈరోజు వీర్వాల్ శ్మశానవాటికలో జరుగుతాయని వెల్లడించారు. నీలంబెన్ మృతిపట్ల పలువురు సంతాపం వ్యక్తం చేశారు.