సలహాదారుల వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో గురువారం విచారణ జరిగింది. దేవాదాయశాఖ సలహాదారుడు శ్రీకాంత్ నియామకం, ఉద్యోగుల సలహాదారుడు చంద్రశేఖర్ రెడ్డి నియామకంపై విచారించిన హైకోర్టు ఈ సందర్భంగా తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఏవైనా రాజకీయాలుంటే బయటే చూసుకోవాలని పేర్కొంది. రాజకీయాలను కోర్టు వరకూ తీసుకురావద్దని సూచించింది. రాజకీయాలు తీసుకొస్తే ఎలా హ్యాండిల్ చేయాలో మాకు తెలుసని ధర్మాసనం ఘాటుగా స్పందించింది...
సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశతో వెళ్తే నట్టేటా మునిగినట్టేనని సీనియర్ ఐపీఎస్ అధికారి, టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్ హెచ్చరిస్తున్నారు. అధిక డబ్బుకు ఆశపడి వెళ్తే ఉన్న డబ్బు పోతుందని జాగ్రత్త పడాలని సూచిస్తున్నారు. అధిక డబ్బుకు ఆశపడి క్యూనెట్ లాంటి మల్టీ లెవల్ మార్కెటింగ్ సంస్థల ఉచ్చులో చిక్కుకోవద్దని సూచించారు. అవి మోసపూరిత సంస్థలని స్పష్టం చేశారు. విహాన్ డైరెక్ట్ సెల్లింగ్ ప్రైవేట్ లిమిటెడ్ మా...
వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ కచ్చితంగా విజయం సాధిస్తుందని.. టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసీపీపై ఆయన విమర్శల వర్షం కురిపించారు. రాష్ట్రంలో రాక్షస, సైకో పాలన సాగుతోందని మండిపడ్డారు. సైకో పాలన పోవాలంటే.. సైకిల్ రావాలన్నారు. వైసీపీ గెలిచిన ఏడాదిలో మద్యం షాపులు మూసివేస్తామన్నారు. కానీ మద్యంపాలసీ పైనే ఆధారపడి ప్రభుత్వాన్ని నడుపుతున్నా...
యువత ఆలోచన ధోరణి మారుతోంది. చదువుకుని ఉద్యోగం చేయడమనేది పాత పద్ధతిగా భావిస్తున్నది. సోషల్ మీడియా సహాయంతో తమ ఆలోచనలకు పదును పెట్టి కొత్త పనులతో అటు ఆదాయం.. ఇటు పేరు ప్రఖ్యాతులు పొందుతున్నారు. దెబ్బకు స్టార్ స్టేటస్ పొందుతున్నారు. అలాంటి కోవకే చెందిన వ్యక్తి బిహార్ కు చెందిన 27 ఏళ్ల హర్ష్ రాజ్ పుత్. యూట్యూబ్ ద్వారా వీడియోలు చేస్తూ ఏకంగా రూ.50 లక్షల విలువైన ఆడి కారు కొనుగోలు చేసే స్థాయికి ఎదిగాడు...
ఏపీ ఉద్యోగ సంఘం నేతలు గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్‌ను కలిశారు. వేతనాలు లేక ఇబ్బందులు పడుతున్నామని వినతి పత్రం ఇచ్చారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ ఉద్యోగులు అందరు నిస్సహాయక స్థితిలో ఉన్నారన్నారు. ఉద్యోగుల ఆర్థిక ప్రయోజనాలను ప్రభుత్వం సకాలంలో చెల్లించడం లేదన్నారు. ప్రతి నెల 1వ తేదీన వేతనాలు ఇవ్వాల్సి ఉందని చెప్పారు. కానీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఉద్యోగుల అనుమతి లేకు...
తెలంగాణ రాష్ట్రంలో కంటి వెలుగు రెండో విడత ఈ రోజు (గురువారం) ప్రారంభమైంది. మొత్తం 1500 స్క్రీనింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 15 వేల మంది సిబ్బంది పరీక్షలు చేస్తున్నారు. నడవలేని వారి కోసం కాలనీల వద్దకు వచ్చి పరీక్షలు చేస్తారు. 100 రోజుల్లో కోటిన్నర మందికి పరీక్షలు చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు. 8 నెలల కింద తొలి విడత పూర్తి చేయగా.. ఇప్పుడు 100 రోజుల్లో రెండో విడత చేస్తామని మంత్రి హరీశ్ ర...
2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను నిర్మలా సీతారామన్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్‌కు ముందు గూఢచర్యం సంఘటన కలకలం రేపుతోంది. ఆర్థిక శాఖలో కాంట్రాక్ట్ ఉద్యోగిగా పని చేస్తోన్న ఓ వ్యక్తి రహస్య సమాచారాన్ని విదేశాలకు అందిస్తున్నట్లుగా ఢిల్లీ పోలీస్ క్రైమ్ బ్రాంచ్ గుర్తించింది. అతనిని అరెస్ట్ చేసింది. నిందితుడిని సుమిత్‌గా గుర్తించారు. అతను కాంట్రాక్ట్ ఉద్యోగి. అతను డేటా ఎంట్రీ ఆపరేటర్‌గా పని...
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ ప్రశంసల వర్షం కురిపించారు. ఇటీవల రాహుల్ జోడో యాత్రలో పాల్గొన్న రఘురామ్ రాజన్ తాజాగా రాహుల్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాహుల్ చాలా తెలివైన వ్యక్తి. రాహుల్ ని విమర్శించే వారు ఆయనని పప్పు అంటారు. కానీ… అది తప్పు అని రఘురామ్ రాజన్ అన్నారు. రాహుల్ గాంధీ ఏ విధంగానూ ‘పప్పు’కాదు ‘తెలివిగల వ్యక్తి’అని చెప్పారు. ఆయనతో సంభాషిస్తే...
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కెరీర్ స్టార్టింగ్ నుంచి వైవిధ్యంగానే సాగుతున్నాడు. హిట్, ఫట్‌తో సంబంధం లేకుండా.. ఎప్పటికప్పుడు కొత్త కంటెంట్‌తో అలరించే ప్రయత్నం చేస్తున్నాడు. గతేడాది గనిగా వచ్చిన వరుణ్ తేజ్.. ప్రస్తుతం ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో సాలిడ్ యాక్షన్ మూవీ చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ మొత్తం యూకేలోనే జరగనుంది. లండన్ షెడ్యూల్‌లోనే 80 శాతం షూటింగ్ కంప్లీట్ చేసేలా ప్లాన్ చేశారు. మిగతా 20 శాత...
ఇలాంటి ముఖ్యమంత్రిని తన రాజకీయ జీవితంలో చూడలేదన్నారు మంత్రి పెద్దిరెడ్డి. మంగళగిరిలో రాష్ట్ర అటవీ శాఖ కార్యాలయాన్ని ప్రారంభించారు పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి. ఈ సందర్భంగా మాట్లాడారు. యాభై ఏళ్ల నుండి తాను రాజకీయాల్లో ఉంటున్నట్లు చెప్పారు. జగన్ వంటి ముఖ్యమంత్రిని మాత్రం చూడలేదన్నారు. 2024లోను మళ్లీ వైసీపీనే గెలుస్తుందని చెప్పారు. జగన్ మరోసారి ముఖ్యమంత్రి కావడం ఖాయమన్నారు. ప్రజాస్వామ్యంలో ఇంత గొ...
తమ పార్టీ సభకు జనాలు పెద్ద ఎత్తున వచ్చారని.. డ్రోన్ షాట్లు, కెమెరాలతో రికార్డు చేసి పబ్లిసిటీ కోసం ఇరుకైన ప్రాంతంలో సభ పెట్టారని చంద్రబాబు మీద అంబటి నాగ రాధాకృష్ణ యాదవ్ ఎన్ హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేశారు. ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉండటం వల్లే తమ సభకు పెద్ద ఎత్తున జనాలు వచ్చారని ప్రచారం చేసుకునేందుకు బాబు అలా చేశారని ఆయన ఆరోపించారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కందుకూరులో నిర్వహించిన సభ మీద ఆయన [&h...
వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే తెలుగుదేశం, జనసేన పార్టీల కూటమి గెలుపొందడం ఖాయమన్నారు. వైసీపీ 175 సీట్లలో గెలుస్తాం అని మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తుందని మండిపడ్డారు. అదీ కలలో కూడా జరిగే అవకాశం లేదన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీకి ప్రజల నుంచి ఆదరణ లభించనుందని తెలిపారు. ప్రస్తుత ట్రెండ్ పరిశీలిస్తే వైసీపీకి ఓటమి తప్పేల...
నటి నిత్యామీనన్ విద్యార్థులకు తెలుగు పాఠాలు చెప్పింది. ఇందుకు సంబంధించిన వీడియో తన ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. ఈ మలయాళీ భామ తెలుగు చక్కగా మాట్లాడుతోందని నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రస్తుతం ఆమె ఓ మలయాళీ సినిమాలో నటిస్తోంది. సినిమా షూటింగ్‌లో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణాపూరంలో సందడి చేశారు. షూటింగ్ తర్వాత స్థానిక గవర్నమెంట్ స్కూల్‌కు వెళ్లారు. కాసేపు చిన్నారులతో సరదాగా గడిపారు. ఇంగ్ల...
ఖమ్మంలో బీఆర్ఎస్ తొలి బహిరంగ సభ విజయవంతంగా జరిగింది. మంత్రి కేటీఆర్ మాత్రం కనిపించలేదు. జాతీయ పార్టీగా అవతరించిన తర్వాత జరిగిన తొలి బహిరంగ సభకు దూరంగా ఉన్నారు. ఇందుకు పలు కారణాలు ఉన్నాయి. సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళతారు. ఆయనతోపాటు అల్లుడు, మంత్రి హరీశ్ రావు కూడా వెళ్లక తప్పేట్టు లేదని ప్రచారం జరుగుతుంది. ఇటీవల ఇదే విషయాన్ని ప్రతిపక్ష నేత ఒకరు పేర్కొన్నారు. రాష్ట్రంలో సీఎం పదవీని కేటీఆర...
తెలంగాణలో సై అంటే సై అంటున్న బీజేపీ, బీఆర్ఎస్ ఓ విషయంలో మాత్రం ఒకే ఆలోచనతో ఉన్నాయట. కలిసి పని చేయనప్పటికీ… అమిత్ షా, కేసీఆర్‌ల ఆరాటం జగన్ గెలుపు, చంద్రబాబు ఓటమి అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. 2015లో ఓటుకు నోటు కేసు నుండి చంద్రబాబును టార్గెట్ చేస్తూ వస్తున్నారు కేసీఆర్. అలాగే, 2019 ఎన్నికలకు ఆరు నెలల ముందు తన రాజకీయ మనుగడ కోసం ఏపీలో తమను బద్నాం చేసేందుకు అస్త్రశస్త్రాలు ఉపయోగించిన టీడీపీ అ...